Sunday, March 2, 2008

పట్టి

పట్టి అంటే మళయాళ బాషలో కుక్క. మళయాళీలు పోడా పట్టి అంటూ ఉంటారు. మనది ఆ పట్టి కాదు. కాలవలను, బోదెలను దాటేందుకు ఒక దుంగను అడ్డుగా వేస్తుంటారు. గోదావరి జిల్లాలలో అలా కాలవలపై ఉండే దుంగలను పట్టి అని వ్యవహరిస్తుంటారు. తాటి, కొబ్బరి చెట్లను ఇలా ఎక్కువగా వినియోగిస్తుంటారు. చిన్న కాలవలకు చెట్ల కొమ్మలను వాడుతుంటారు. తమ పంట చేలకు నీళ్ళు పెట్టేందుకు ఈ పట్టి అనేదాన్ని ఆధారం చేసుకొని తాటాకులతో, కొబ్బరి ఆకులతో ఒక దడిలా కడతారు. దాంతో నీరు కొంతవరకూ ఆగి వాళ్ళ చేలలోకి వెళుతుంటుంది. పట్టి అనే వీటిపై నడి చేందుకు కొంత ప్రావీణ్యం అవసరం. అదే వర్షాకాలమైతే మరీ అద్భుతమైన ప్రావీణ్య అవసరం. కొత్త వారైతే నేర్వకుండానే డాన్సు చేయచ్చు తడిచిన వీటిపై. అయిటే అలాంటి సంధర్భాలలో కూడా పొలాల్లో పని చేసే కూలీలు పెద్ద మోపులను తలపై పెట్టుకొని సునాయాసంగా చక చకా నడిచి వెళ్ళిపోతుంటారు దీనిపై.
మా ఇంటికి దగ్గరలో చిన్న కాలువలు చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుండీ పొలాలలో తిరగటం అలవాటైన నాకు అలాంటి పట్లపై నడవటం అలవాటే. అందుకే ఇలా.


కాకుంటే మా స్నేహితుల పరిస్థితేమిటో మీరూ చూడండి."

5 comments:

విహారి(KBL) said...

నాకు చిన్నప్పుడు దాని మీద నడవటమంటే భయమేసేది. తరవాత అలవాటయ్యింది

రాధిక said...

మా ఇంటి పక్కనే మా పొలం.ఇంటికి,పొలానికి మధ్య బోదె, దాని మీద పట్టీ.రోజులో మూడు సార్లు ఆ పట్టి దాటి వెళ్ళి ఆడుకోనిదే రోజు గడవదు మాకు.ఊరిలో చాలా మందికి కూడా రోజు గడవదు.ఎందుకంటే మా పొలం దాటాకనే కాలువ.మా ఫ్రెండ్స్ ప్రతీ సంవత్సరం కార్తీక మాసం లో,వేసవి సెలవుల్లొ మా ఊరికి వస్తుండేవారు.ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయం లో పడి పునీతులయిన వారే.మాకు పోటీలు వుండేవి.పట్టీ ని వాడకుండా ఒక్క గెంతులో ఈ గట్టు నుండి ఆ గట్టు కు దూకాలి.పెద్దోళ్ళు కూడా ఈ పోటీని ఆశక్తిగా చూసేవారు.మీ చిన్ని టపా నాకు బాల్యాన్నంతా కళ్ళముందు తిప్పుతుంది.చాలా చాలా థాంక్స్

రవీంద్రనాధ్ గెడ్డం said...

విశ్వనాధ్ గారూ,
"పట్టి" మీద బ్లాగు బాగుంది. మరి "పుట్టి" మీద కూడా వ్రాస్తే చూడాలని ఉంది.

Anonymous said...

టపా ముచ్చటగా వుంది. బొమ్మలు కూడా బావున్నాయి.నాకు మాత్రం మీ మీద అసూయగా వుంది. నాకు ఇలాంటివేవీ తెలీదు, మాది సీమ, పైగా పెరిగింది టవును వాతావరణంలో...

విహారి(KBL) said...

మీకు ఉగాది శుభాకాంక్షలు